calender_icon.png 1 January, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూ ఐఎస్‌సీ విద్యార్థులకు అవార్డు ప్రదానం

31-12-2025 01:38:42 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : డాక్టర్  అరికపూడి రఘు సేవా ట్రస్ట్ 40వ వార్షికోత్సవం సందర్భంగా  హైదరాబాద్ నాంపల్లి లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం ఐ.యు.సి.ఈ.ఈ స్టూడెంట్ చాప్టర్ ఏ.యూ.ఐ.ఎస్. సి విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేయబడింది. 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సస్టైనబిలిటీ, సామాజిక ప్రభావం రంగాలలో ఏయూఐఎస్సీ చూపిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ గౌరవం అందజేయబడింది.

ఈ అవార్డు ద్వారా ఏయూఐఎస్సీ చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తించారు. సస్టైనబిలిటీ అండ్ ఎస్ డి జి ఎస్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ను ప్రోత్సహిస్తూ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను ఇంజినీరింగ్ విద్యలో సమగ్రంగా అమలు చేయడం, దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద సి ఎస్ ఆర్ సమిట్ తొలి ఎడిషన్ ‘ఇగ్నైటింగ్ స్పార్క్ ఫర్ సోషల్ చేంజ్‘  లో గిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ జోన్ పార్ట్నర్ గా సేవలందించడం ద్వారా ఈ అవార్డుని అందుకున్నారు.

ఈ గౌరవాన్ని డాక్టర్  రఘు అరికపూడి చైర్మన్, డాక్టర్ అరికపూడి రఘు సేవా ట్రస్ట్, వినిల్ రెడ్డి లైసెన్సీ, సిఎస్‌ఆర్ సమిట్ ఏయూఐఎస్సి సభ్యులకు అందజేశారు. విద్యార్థులను సామాజిక బాధ్యత వైపు నిరంతరం ప్రేరేపిస్తున్న ఏయూఐఎస్సి కృషికి ఇది గుర్తింపుగా నిలిచింది. ఈ గుర్తింపుని అందుకున్న విద్యార్థులను విశ్వవిద్యాలయం అధ్యాపకులు, యాజమాన్యం అభినందించారు.