calender_icon.png 1 January, 2026 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్‌బాబు

31-12-2025 01:40:01 AM

రంగారెడ్డి, డిసెంబర్ 30(విజయక్రాంతి):నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా మంగళవారం సాయంత్రం రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో తాత్కాలిక భవన్లో  సుధీర్ బాబు  బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయనను పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. 

ఈ సందర్బంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించానని, రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించుకోవడం జరిగినదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను  ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా  ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ గా తాను బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. 

రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తామని అన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పని చేస్తామని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో 22 పోలీసు స్టేషన్లు పని చేస్తాయని, ఈ పోలీసు స్టేషన్ల అధికారులతో కలిసి టీమ్ వర్క్ తో సమర్థవంతంగా పని చేస్తామని అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.