27 July, 2026 | 1:01 AM

నేడు మోస్తరు వర్షాలు

27-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం (నేడు) తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురువనున్నాయి. 

ఇక ఆదివారం రాష్ట్రంలోని జగిత్యాల్, మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురువగా, నిర్మల్, మంచిర్యాల్, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, కోమురంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కరిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.