calender_icon.png 7 July, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం

07-07-2025 01:35:46 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, జూలై 6 (విజయ క్రాంతి): శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆశయాలను, ఆ కాంక్షలను బీజేపీ తూ.చ తప్పకుండా అమలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ఎంపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావుసహా స్థానిక నేతలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమా ల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే... 370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారని పేర్కొన్నారు. దేశ స్వాలంబన కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరితపిస్తే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతో దేశం స్వయం సమృద్ధి సాధించేలా ఆచరణలోకి తీసుకొచ్చిన మహనీయుడు నరేంద్రమోదీ అ ని తెలిపారు.

“దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో మాతృ భూమికి తిరిగి వస్తే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్రమోదీదని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదని కొనియాడారు.

దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనే అన్నారు. భారతదేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ఆకాంక్షించిన దూరదృష్టి కలిగిన నాయకుడని, ఆ మహనీయుడి ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడమే ఆయనకు అందిస్తున్న ఘనమైన నివాళి అని బండి సంజయ్‌కుమార్‌అన్నారు.