calender_icon.png 7 July, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడి తీర్చండి చిన్న ముల్కనూర్‌లో మహిళల నిరసన

07-07-2025 01:34:22 AM

చిగురుమామిడి, జూలై 6(విజయక్రాంతి): నీటి ఎద్దడి తీర్చాలంటూ చిన్న ము ల్కనూరులో మహిళలు ఆందోళన చేపట్టా రు. గ్రామంలో ఉన్న నాలుగో వార్డులో పది రోజులుగా నెలకొన్న తీవ్ర నీటి సమస్యతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. దీని పై పలుమార్లు గ్రామ పంచాయతీకి ఫిర్యా దు చేసినా, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం ఖాళీ బిందెల తో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తక్షణమే తమ ప్రాంతానికి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న స్పందించారు.

నీటి ఎద్దడి సమస్యలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు. అలాగే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నామని ఆమె హామీ ఇ చ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో రంగు పద్మ, పైడిపల్లి రేణుక, మల్లవ్వ తదితరులుపాల్గొన్నారు.