16-12-2025 05:24:37 PM
శ్రీ వెంకటేశ్వరస్వామి దీక్షలు తీసుకున్న సునీత సుగుణాకర్ దంపతులు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): మార్గశిరం ముక్తికి సోపానం.. పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ప్రారంభం కాగా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఉపాసకురాలు దేవుని నరసమ్మ సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి దీక్షలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాదుల సుగుణాకర్ సునీత దంపతులు తీసుకోవడం జరిగింది. అమ్మ గోదా మాత సేవలో నెల రోజులపాటు ఈ దీక్షలు ఉంటాయని వారు తెలిపారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో పూజారి సౌమిత్రి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ధనుర్మాసం నెలరోజుల వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భక్తులు పెద్దఎత్తున పాల్గొంటారు.