16-12-2025 05:30:07 PM
భైంసా (విజయక్రాంతి): లోకేశ్వరం మండలం రాయపూర్ కాలనీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా 100 డయల్ కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ వ్యక్తిని కాపాడారు. కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోతానని గోదావరి నది వైపు వెళ్లగా పోలీసులు అతన్ని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.