16-12-2025 05:26:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆశ వర్కర్ యూనియన్ మంగళవారం జిల్లా వైద్యాధికారి రాజేందర్ కు వినతిపత్రం అందించారు. పెండింగ్ డిమాండ్ పరిష్కరించి పనికి తగ్గ పారితోషకం చెల్లించాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత గంగామణి కమల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.