04-10-2025 07:16:31 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందని జెడ్పిటిసి, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.