calender_icon.png 5 October, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ పథకాలు ప్రజలకు మేలు

04-10-2025 07:17:28 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను ఎస్బిఐ బ్యాంకు అందజేస్తుందని పూసుగూడెం ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ బి.నాగేంద్ర బాబు తెలిపారు. శనివారం  శాఖలో కస్టమర్ కుంజా ముత్యాలు మరణానంతరం నామినీగా ఉన్న ఆయన భార్య కుంజా వెంకటమ్మకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద మంజూరైన రూ.2,00,000/- బీమా క్లెయింను అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర బాబు మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న PMJJBY, PMSBY (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), APY (అటల్ పెన్షన్ యోజన)తో పాటు మా ఎస్బిఐ శాఖ అందిస్తున్న రుణ సౌకర్యాలు, చిన్న పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండడమే గాక ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ప్రతి కుటుంబం ఈ పథకాలలో చేరి తమ భవిష్యత్తును భద్రపరచుకోవాలని సూచించారు.