calender_icon.png 15 September, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యం పేరుతో కాసుల దందా..!

15-09-2025 12:00:00 AM

- ఆర్‌ఎంపి, పిఎంపి ఇతర ఆసుపత్రుల నుంచి రోగుల మళ్లింపు

- అవసరం లేకపోయినా రోజుల తరబడి ట్రీట్మెంట్

- రెఫర్ చేసిన వారికీ రోగుల బిల్లు నుండే కమిషన్

- తీవ్రంగా నమ్మి మోసపోతున్న సామాన్యులు

 నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 14 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి సామాన్య రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వైద్యం పేరుతో కాసుల దందాకు తెర లేపుతోంది. ఆయా స్పెషలిస్టుల వైద్యుల పేర్లు బోర్డులపై తగిలించి వారి పేరుతో రోగులను గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపి, పి.ఎం.పి, ఆశ, ఏఎన్‌ఎం ఇతర ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహాయంతో రప్పించి రోజుల తరబడి అవసరం లేకపోయినా వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో ఆట లాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి. సదరు ఆసుపత్రి ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈనెల 12న విజయ క్రాంతి ‘అమ్మో ఆస్పత్రి ‘ అనే వార్తా కథనా న్ని ప్రచురించింది.

దీంతో అధికారులు, జిల్లా వాసులతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆస్పత్రి దోపిడీ వ్యవహారంపై మోసపోయిన బాధితుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. అధికారులను ప్రజాప్రతినిధులను సైతం చె ప్పుచేతల్లో ఉంచుకోవడం వల్లే ఈ ఆసుపత్రి ఆగడాలు శృతిమించుతున్నాయని బాధిత రోగులు ఆరోపిస్తున్నారు. 24 గంటలు అం దుబాటులో ఉంటున్నట్లు ప్రకటనలు చేసుకునే సదరు ఆసుపత్రి యాజమాన్యం రాత్రి 8 గంటల దాటిందంటే కిందిస్థాయి సిబ్బం ది చేతే స్థాయికి మించిన వైద్యం చేయిస్తూ కార్పొరేట్ లెవెల్లో డబ్బులు దండుకొని సొ మ్ము చేసుకుంటున్నట్లు రోగులు మండి పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల నుండి రోగులను రెఫర్ చేసిన సదురు ఆర్‌ఎంపీలకు రోగులు చెల్లించిన బిల్లుల నుండే కమీషన్ ముట్ట చెబుతుండడంతో రోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. దీంతో పాటు ఆయా టెస్టులు జరిపే సిబ్బంది సైతం నెలవారి జీతాలు తక్కువ చెల్లించి అవగాహన అర్హత లేని వారినే ఏర్పా టు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి వెళ్లే రోగుల పట్ల దురుసుగా, చీదరింపులతో అవమానిస్తున్నారని రోగులు ఆ రోపిస్తున్నారు. సరైన వైద్యం అందక ప్రశ్నిం చే రోగులకు రాజకీయ నేతలు పరపతి ఉన్న వారి పేర్లు చెప్పి రోగులను భయభ్రాంతుల కు గురి చేస్తున్నట్లు రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఐసీయూ పేరుతో అడ్డగోలు వసూళ్ళు

తీవ్ర అనారోగ్యం, ఎక్కువ శాతం గాయపడిన రోగులకు అధునాతన వైద్య సంరక్షణ, నిరంతర పర్యవేక్షణను అందించే ప్రత్యేక విభాగాన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( ఐ సీయూ ) అని పిలుస్తారు. రోగం చిన్నదైనా పెద్దదైనా డబ్బులు దండుకోవడమే పనిగా అవసరం లేని వారికి సైతం ఐసియు కేర్ యూనిట్లో చికిత్స అందించాలని రోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి నుండి ముక్కు పిండి డబ్బులు గుంజుతున్నట్లు విమర్శలు పెరుగుతున్నాయి.

రోగం ఒకటైతే మరొక రకమైన వైద్యం చేస్తూ కాలయాపన చేసి రోగుల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కడుపునొప్పి బాధతో ఆస్పత్రిలో చేరిన రోగికి కిడ్నీ సం బంధిత వైద్యం చేసి సుమారు 50 వేల దా కా డబ్బులు దండుకున్నారు. కానీ రోగం నయం కాకపోవడంతో హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోగా లివర్ డ్యామేజ్ అయ్యిందని మరొక రోజు ఆలస్యం చేస్తే రో గి ప్రాణం పోయేదని రోగి బంధువులు ఆం దోళన వ్యక్తం చేశారు. మరో రోగికి వారం రోజులపాటు ట్రీట్మెంట్ చేయిస్తున్నామని కా లయాపన చేసి లక్షల దండుకున్నారని చివరికి ప్రాణం కూడా దక్కలేదని సదరు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఐసీ యూ అందుబాటులో ఉందని దాని పేరు చెప్తూ ఒక్కో రోగి నుండి లక్షలు వసూలు చేస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సదరు ఆసుపత్రిఫై ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరిపి వైద్యులు పనిచేసే కిందిస్థాయి సిబ్బంది అర్హత స్థాయిని పరిశీలించి ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.