15-09-2025 12:00:00 AM
- గతనెలలో భారీ వర్షాలకు జిల్లాలో 6,200 ఎకరాల్లో పంటనష్టం
- దెబ్బతిన్న 1,237 ఇండ్లు
- నివేదికలు తయారు చేసిన అధికారులు
- పరిహారం చెల్లింపుపైనే అనుమానాలు ?
మెదక్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు మెతుకుసీమ అతలాకులతం అయింది. భారీగా పంట నష్టం వాటిల్లింది. రహదారులు, కల్వర్టులు, కాజ్వేలు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. వీటికి తోడు చెరువులు, వాగులు ఉప్పొంగడం, పలు చెరువులకు బుంగలు పడ్డాయి. భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. భారీ నష్టమే వాటిల్లినట్లు గా ప్రాథమికంగా అధికారులు అంచనాలు వేశారు. వర్షాలు తగ్గిన తర్వాత అధికారులు నివేదికలు తయారు చేశారు. మెదక్ జిల్లాలో 6,200 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 1,2 37 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 15 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయినట్లు ని ర్ధారించారు. అయితే అధికారుల పంట నష్టం లెక్క తేలినా పరిహారం చెల్లింపు విషయంలోనే ఆందోళన చెందుతున్నారు.
80 శాతం వరి పంటకు నష్టం..
జిల్లాలో భారీ వర్షాల కారణంగా 6,200 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో 80 శాతం వరి పంట దెబ్బతిన్నట్లు స్పష్టం చేశారు. 15 శాతం పత్తి, మరో 5 శాతం వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. కాగా పొ లాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను ఉపాధిహామీ కూలీలతో తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అన్నదాతలకు కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.
భరోసాపై ఆందోళన...
జిల్లావ్యాప్తంగా 6,200 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 1,237 ఇళ్లు పాక్షికంగా, 15 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యా యి. బాధితులకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో వారికి ఎలాం టి భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలే దు. గతంలో సైతం అతివృష్టి, అనావృష్టి వ ల్ల పంటలు దెబ్బతింటే ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ పేరు న అందించి చేతులు దులుపుకున్నారు. అవికూడా సరియైన సమయంలో ఇవ్వలేదు. గ త రబీ సీజన్లో అకాల వర్షాలకు 308 మంది రైతులకు సంబంధించి 876.16 ఎకరాల్లో వి విధ రకాల పంటలు దెబ్బతినగా, ఇందుకు సంబంధించి ఎకరాకు రూ. 10 వేల చొ ప్పున రూ.37.64 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఈ పరిహారం గురించి అధికారుల వద్ద స మాధానం లేకపోవడం గమనార్హం. గతనెల లో వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరి హారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారికి నేటికీ నయాపైసా అందలేదు. అలాగే దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఎ కరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పింది. ఈ మేరకు వారికి రూ.6.20 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కూలి న ఇళ్లకు ఎంత మేర పరిహారం ఇస్తారనే విషయంపై అధికారులు స్పందించడం లేదు.