15-11-2025 01:31:38 AM
బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
బెంగళూరు, నవంబర్ 14 : కర్ణాటకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వృక్షమాత సాలుమరద తిమ్మక్క (114) కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.
వేలాది మొక్కలు నాటి జీవితాన్ని వాటి సంరక్షణకు పాటుపడిన తిమ్మక్క ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోతారని పేర్కొన్నారు. 1911 జూన్ 30న జన్మించారు. ఆమె చేసిన నిస్వార్థ సేవకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా ఆమె ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్షమాత తదితర అవార్డుతో పాటు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.