వాసవీ మాత త్యాగం, అహింసా మార్గం సమాజానికి ఆదర్శం
ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వాసవి మాత త్యాగము అహింస మార్గము సమాజానికి ఆదర్శం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శాంతి, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నారు. వాసవి మాత జయంతి వేడుకల్లో ఎస్పీ పిలుపు నీచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ వాసవి మాతవ చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వాసవి మాత త్యాగం, అహింసా మార్గం సమాజానికి ఆదర్శమని తెలిపారు. విలువలు ఉన్న సమాజమే శక్తివంతమైన దేశానికి పునాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొని వాసవిమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.






