13-01-2026 10:58:08 PM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో మంగళవారం నాడు ఎస్ఐ రవి గౌడ్ ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్ఐ రవి గౌడ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.
లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదని, వాహన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారులు తప్పక రోడ్డు నియమాలు పాటిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, హేల్మేంట్, సీట్ బెల్ట్ ధరించాలి. రాంగ్ రూట్లో, అదిక స్పీడ్లో వెళ్ళకూడదని, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితిల్లో డ్రైవింగ్ చేయకూడదు, రోడ్డు ప్రమాదాల వళ్ళ జరిగే నష్టాల గురించి వివరించారు. ప్రతి వాహనాదరులు హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అని ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.