10-10-2025 12:00:00 AM
-ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
-బండా నరేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, అక్టోబర్ 9 : కాంగ్రెస్ 22 నెలల పాలనలో అభివృద్ధి, హామీలు కాగితాలకే పరిమితమైందని, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ బాకీలను ప్రజలకు వివరించి బిఆర్‌ఎస్ అభ్య ర్థుల గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు.
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం బిఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి స్థానిక సంస్థ ల ఎన్నికల సమావేశం నకిరేకల్ మాజీ ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మరచిన హామీలను కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజలకు గుర్తు చేస్తున్నా మన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓట్ల కో సం పడరానిపాట్లు, తినరానిగడ్డి తిన్నారన్నా రు.
అమలుకానీ హామీలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో అన్నివర్గాల వర్గాల ప్రజ లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 4 వేల పెన్షన్ ఇస్తామని వృద్దులను, 6 వేలు ఇస్తామని దివ్యాంగుల ను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అ న్నారు. మహిళలను, విద్యార్థినులను, నిరుద్యోగులను, ఆటోకార్మికులను, రైతు కూలీల ను మోసం చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అని అన్నారు. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడం లేదన్నారు.
సమావేశంలో మాజీ జెడ్పిటిసి తరాల బలరాం, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సంధినేని వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కొప్పుల ప్రదీప్ రెడ్డి, రాములు, శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, ఐలయ్య, మల్లేశం, కరుణాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.