10-10-2025 12:00:00 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి అక్టోబర్ 9 (విజయక్రాంతి) : వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. గురువారం భువనగిరి మండలం కేంద్రంలో ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఏ టీ సి సెంటర్ లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఏ ఏ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ ఇస్తున్నారని.విద్యార్థులకు అన్నివసతులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. విద్యార్థులు అందరూ కూడా కష్టపడి శ్రద్ధ తో ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు . రాబోయే కాలంలో మొత్తం ఈ అడ్వానస్డ్ టెక్నాలజీ రంగంలో జాబ్ లు ఉంటాయని అన్నారు. డిగ్రీ ఇతర చదువుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా పొందవచ్చును అన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్ బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.