25-07-2025 07:39:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కార్మికుల సమావేశం నిర్వహించి ఈనెల 31న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులకు పని భద్రత కార్మిక చట్టాల భామలు కూలి రేట్లు పెంచు ఇతర సదుపాయిలపై ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ లక్ష్మణ్ గంగన్న గఫూర్ బక్కన్న తదితరులు పాల్గొన్నారు