calender_icon.png 26 July, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్డ్ షాపులపై యాజమాన్యం నిరంతరం నిఘ ఉంచాలి

25-07-2025 08:00:34 PM

హుజూర్ నగర్ సీఐ చరమందరాజు

హుజూర్ నగర్: గోల్డ్ షాపులపై యాజమానులు నిరంతరం ప్రత్యేక నిఘ ఉంచాలని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు.శుక్రవారం పట్టణంలోని గోల్డ్ షాపులను పరిశీలించి మాట్లాడారు..ఇటీవల సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై గోల్డ్ షాపు యాజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుకాణాల చుట్టూ భద్రతా కెమెరాలను ఏర్పాటు చేయడం, మంచి లైటింగ్ ఉండేలా చూసుకోవాలని, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వడం షాపులోకి వచ్చే ప్రతి ఒక్కరిని పరిశీలించడం, షాపు లోపల,చుట్టూ గట్టి భద్రత ఉండేలా ప్రత్యేక ఐరన్ జాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా పరిసర ప్రాంతాలలో కనిపించినట్లయితే వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గోల్డ్ షాప్ యాజమానులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.