11-12-2025 12:00:00 AM
జిల్లా వాసికి దక్కిన అరుదైన గౌరవం
కొత్తగూడెం, డిసెంబర్ 10, (విజయక్రాంతి ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మూవీ మేకప్ ఆర్టిస్ట్, మహిళా నాయకురాలు, సామాజిక సేవకురాలు, ఉమెన్స్ వారియర్స్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ అయిన సాయిబాను బుధవారం రోజున, నీతి ఆయోగ్ వరల్ హ్యూమన్ రైట్స్ డే సందర్బంగా, సోషల్ జస్టిస్ ఫర్ వరల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హైదరాబాద్, ఫౌండర్ కొప్పుల విజయ్ కుమార్ ,నేషనల్ చైర్మన్ వరల్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ ఆధ్వర్యంలో, హిప్నో డాక్టర్ పద్మ కమలాకర్, ఐపీఎస్ శ్రీనివాస్, సైదులు చేతుల మీదుగా తెలంగాణ సరస్వత పరిషత్ కింగ్ కోటి హైదరాబాద్ లో ‘ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ అచీవ్మెంట్ అవార్డు‘ అందుకున్నారు..
సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సాయిబాను ,మూవీ మేకప్ ఆర్టిస్ట్ గా ఎదుగుతూ,మహిళలకు ఉచితంగా కొత్తగూడెం లో బ్యూటిపార్లోర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కేరళ నుంచి స్పెషల్ గా తెప్పించే హెయిర్ ఆయిల్స్, వెయిట్ లాస్ ఆయిల్స్ చాలా తక్కువకే అందరికి ఇస్తున్నారు.మహిళలు ఎల్లపుడు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా చేస్తున్నారు. మహిళలలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ధైర్యంను నింపుతూ ముందుకు దూసుకుపోతున్నారు.
ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగిన ముందు ఉండి పోరాటం చేస్తున్నారు. సామాజిక అసమానతలకు గురికాకుండా, మానవ హక్కుల గురించి అవగాహనా కల్పిస్తున్నారు. మహిళలు రాజకీయాలలో కూడా ఇంకా అభివృద్ధి చెంది ముందుకు రావాలి. ఇలాంటి అవారడ్స్ మరెన్నో రావాలి అని కోరుకుంటున్న. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా..
హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొప్పుల విజయ్ కుమార ,నేషనల్ చైర్మన్ వరల్ బుక్ ఆఫ్ రికార్డు డాక్టర్స్, లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.సాయిబాను. ఉచితంగా బ్యూటిషన్ కోర్స్ నేర్చుకొనుట కొరకు ,సంప్రదించాల్సిన ఫోన్ :7729923205.