11-12-2025 12:00:00 AM
సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్
మణుగూరు, డిసెంబర్10, (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ప్రమాదాలను నివారించేందుకు రక్షణ సూత్రాలను కచ్చితంగా పాటించాలని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అన్నారు. మంగళవారం ఏరియా పీకే ఓసి2 లో నిర్వహించిన 56వ రక్షణ పక్షోత్సవాల సందర్శన కార్య క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మికులు భద్రత కోసం కచ్చితమైన చర్యలు చేపడుతుందనితెలిపారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పని చేస్తుందన్నారు.
ప్రమాదాలను నివారించి నాణ్యతతో కూడి బొగ్గును ఉత్పత్తి చేసి సంగరేణి సంస్థ పటిష్టను విశ్వవ్యాప్తం చేయాలన్నారు. ఈ సందర్భంగా రక్షణ ప్రాముఖ్యతను ప్రతిబింబిం చేలా స్థానిక కళాబృందం నాసర్ పాషా రచనా, దర్శకత్వంలో ప్రదర్శించిన రక్షణ సందేశం నాటిక ఉద్యోగస్తులకు,కార్మికులకు రక్షణ సూత్రాలను మరోమారు గుర్తు చేశారు.
కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి రమేష్ , గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరి వై. రాంగోపాల్, ప్రాతినిధ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ వత్సవాయి కృష్ణంరాజు, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు మదన్ నాయక్, ఎస్ ఓ టు జి ఎం శ్రీనివాసాచారి, సేఫ్టీ ఆఫీసర్ వెంకటరామారావు, ఏజిఎం. రాంబాబు , ఇన్ ఛార్జ్ ఏరియా ఇంజనీర్ వీరభద్రుడు పాల్గొన్నారు.