13-01-2026 12:00:00 AM
కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ
కోదాడ, జనవరి 12: సంక్రాంతి ముగ్గులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలాల సత్యనారాయణ అన్నారు. సోమవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతితో పండుగల ప్రాధాన్యత తగ్గిపోతుందని విద్యార్థుల్లో సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించేందుకు తమ విద్యా సంస్థలో సర్వ మతాల పర్వదినాలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గాంధీ, డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావులు మాట్లాడుతూ ముగ్గుల పోటీలు లతో విద్యార్ధుల్లో నీ సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలు సుశ్మిత, శరణ్య, అనూషలకు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ డైరెక్టర్ నాగార్జున రావు ప్రిన్సిపాల్ గాంధీ అధ్యాపకులు బహుమతులు అందజేశారు. డైరెక్టర్ నాగార్జునరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.