calender_icon.png 8 November, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకంగా ఎంపీకే టోకరా

08-11-2025 12:59:37 AM

56 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కోల్‌కతా, నవంబర్ 7: సైబర్ నేరగాళ్లు ఏకంగా ఒక ఎంపీ ఖాతానే కొల్లగొట్టారు. రూ.56 లక్షలు దోచేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ కల్యాణ్ బెనర్జీ మొబైల్‌కు ఇటీవల కేవైసీ అప్డేషన్ పేరుతో ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. అనుకోకుండా ఎంపీ ఆ ఫైల్‌ను ఓపెన్ చేశాడు. అంతే.. తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.56 లక్షలు కాజేశారు.

నగదును తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అనంతరం ఆ మొత్తంలో కొంత నగదు డ్రా చేసి నిందితులు ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎంపీ తాను మోసపోయానని గుర్తించి, వెంటనే బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం సైబర్ క్రైం విభాగంలో కేసు నమోదు చేశారు.