08-11-2025 12:36:30 AM
న్యూఢిల్లీ, నవంబర్ 7: స్వతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని చ్చి, బ్రిటిష్ పాలకులను సైతం కలవరపెట్టిన గేయం వందేమాతరం 150 వసంతాలు పూ ర్తి చేసుకుంది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఈ అద్భుత గేయం ఇప్పటికీ భారత ప్రజల స్ఫూర్తి. ఇదే స్ఫూర్తితో శుక్రవారం యావత్ భారతావని వేడుకలు నిర్వహించింది. దేశ పౌరులు వందేమాతరం గేయాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు.
న్యూఢిల్లీలో ని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న ‘వందేమాతరం’ పేరిట స్మారక తపాలా స్టాంపు, నాణేన్ని విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని లోక్ భవన్‌లో నిర్వహించి న ఉత్సవా ల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు వేడుక లోల పాలుపంచుకున్నారు.
కార్గిల్ వార్ మె మోరియల్, అండమాన్ నికోబార్‌లోని సె ల్యులార్ జైలు, ఒడిశాలోని స్వరాజ్ ఆశ్ర మం, ఆగ్రాలోని షహీద్ స్మారక్ పార్క్, వారణాసిలోని నమో ఘాట్ వంటి జాతీయ ప్రా ధాన్యం కలిగిన ప్రదేశాల్లో ప్రజలు సామూహిక గేయాలాపన చేశారు. వేడుక ల్లో విద్యా ర్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వై ద్యులు, ఉపాధ్యాయులు సహా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గేయం దేశ ప్రజలకు ప్రేరణ
ప్రధాని నరేంద్ర మోదీ
వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలు.. దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని, ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహించుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్‌కు సరికొత్త భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన గుండెలను హత్తుకుంటుందని, స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఢిల్లీలోనిలో నిర్వహించిన వందేమాతరం 150 వసంతాల వేడుకలో ప్రధాని మోదీ మాట్లాడారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో వందేమాతరం గేయం స్ఫూర్తి నింపిందన్నారు. ఈ సందర్భంగా వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని చెప్పారు. ప్రతి గీతానికి ఒక మూలభావం, సందేశం ఉంటుందని, మన వందేమాతరం మూలభావం భారత్ అని పేర్కొన్నారు. ఈ గయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం బహిరంగ ప్రదేశాల్లో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సామూహిక గేయాలాపనలో ప్రధాని కూడా పాల్గొని పాడారు.
గేయం విశేషాలు..
బెంగాలీ రచయిత, కవి బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘అనంద్‌మఠ్’ అనే గ్రంథం నుంచి వందేమాతర గేయం ప్రజల్లోకి వెళ్లింది. గేయం మొట్టమొదటిసారిగా ‘బంగా దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. వందేమాతరానికి అర్థం ‘తల్లీ! నీకు వందనం’. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి నేతలు గే యాన్ని ఆలపింపించారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గేయానికి సంగీతాన్ని సమకూర్చడం విశేషం. 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో ఈ గేయం శక్తిమంతమైన పాత్ర పోషించింది. ఎక్క డా చూసినా ప్రజలు ఈ గేయం పాడుతుండటం నాటి బ్రిటిష్ పాలకులను కలవరపెట్టింది. 1905లో బెంగాల్‌లోని రంగపూర్ పాఠశాల విద్యార్థులు వందేమాతర గేయం పాడినందుకు, బ్రి టిష్ పాలకులు ఒక్కో విద్యార్థికి రూ.5 జరిమానా విధించింది.
ఈ చర్య నాటి బ్రిటిష్ ప్రభువుల నియంతృత్వ వైఖరికి నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం సిద్దించిన తర్వాత 1950 జనవరి 24న భార త రాజ్యాంగ సభ వందేమాతర గేయా న్ని జాతీయ గేయంగా ప్రకటిచింది. తద్వార గేయం ‘జనగణమన’ గీతంతో సమానమైన హోదా పొందింది.