7 August, 2026 | 2:30 AM

కేంద్ర మంత్రితో ఎంపీ మల్లు రవి భేటీ

07-08-2026 12:00 AM

ఆమనగల్లు, ఆగస్టు 6 (విజయక్రాంతి): న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను తెలంగాణ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఎంపీ మల్లు రవి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు.