7 August, 2026 | 1:48 AM

విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు

07-08-2026 12:00 AM

ఇంటర్ విద్యార్థులకు పాఠం చెప్పిన కలెక్టర్ దీపక్ తివారి 

వికారాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): విద్యార్థులకు ఇచ్చే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను హెచ్చరించారు. గురువారం వికారాబాద్ జిల్లా కొత్త గడి TSWRS బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లాలోని TWRS గురుకుల పాఠశాల, కళాశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, పలువురు విద్యార్థులు టీసీలు (TC లు) ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తూ ఆ గ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడం లేదా ఇతర విద్యాసంస్థలకు వెళ్లే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో సమగ్రంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, హాస్టల్, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు లెక్కలు బోధించారు. ఈ తనిఖీలో ట్రైని కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, కళాశాల ప్రిన్సిపాల్ సాయి లత, ఎస్సి వెల్ఫేర్ అధికారి జయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.