calender_icon.png 16 September, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్న ఎంపీ మల్లు రవి

16-09-2025 12:00:00 AM

అనంతరం వసతి గృహాల, పాఠశాలల సందర్శన 

అలంపూర్,సెప్టెంబర్ 15:నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి స్వామి ఆలయాలను సోమవారం దర్శించుకున్నారు.ముందుగా వీరికి ఆలయ అధికారు లు,అర్చకులు సాదరంగా స్వాగతం పలికా రు.ఎంపీ స్థానిక నాయకులతో కలిసి ఉభ య ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎంపీ పట్టణం కేంద్రంతో పాటు ఉండవల్లి, ఎర్రవల్లి వసతి గృహాలను వేర్వేరుగా సందర్శించి విద్యార్థుల బాగోగు లు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశా రు.

అనంతరం బాత్రూం సౌకర్యాలను, విద్యార్థుల సంఖ్య పై ఆరా తీశారు. అలంపూ ర్ ఎస్సీ బాలికల హాస్టల్ ఎక్కువమంది వి ద్యార్థులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు వినియోగించుకునే విధంగా అధికారులు చ ర్యలు తీసుకోవాలని తెలిపారు.పాఠశాలలోని మౌలిక వసతులపై తెలుసుకు న్నారు.

యునెస్కో వరల్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపుకు కృషి చేయాలి

అలంపూర్ లోని దేశం యొక్క శిల్పకళ చరిత్ర ఆధ్యాత్మితలకు ప్రతీకగా నిలిచిన నవబ్రహ్మఆలయాల సముదాయానికి యునె స్కో వరల్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఎంపీ మల్లు రవిని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మే రకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేసి ఆ లయాల ప్రాముఖ్యతను వివరించారు.

6,7 శతాబ్దానికి చెందిన నవబ్రహ్మ ఆలయాలు యునెస్కో వరల్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాక పర్యాటకులు పరిశోధకుతో పుణ్యక్షేత్రం యొక్క యొక్క విలువ పెరుగుతుందన్నారు.దేశీయ అంతర్జాతీయ పర్యాట కుల రాకతో స్థానిక ప్రజలకు ఉపాధి, వ్యా పారాలు పెరుగుతాయని తెలిపారు.

ఈ కా ర్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి వి ష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, మార్కె ట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తిరుమల్ ,జోగుల రవి, నల్లారెడ్డి , నారాయణరెడ్డి, గంజిపేట శంకర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.