calender_icon.png 16 September, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్

16-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 మాడ్గుల, సెప్టెంబర్ 15: పల్లెలు దేశానికి పట్టుగొమ్మలాంటివని, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలోని నాగిళ్ల గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో చేపట్టే అంతర్గత డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పాఠశాల ను విజిట్ చేసి విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం  పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో పల్లెలు, తండాలో మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కు తన వంతు సహకారం ఎల్లపుడు ఉన్నటుందని, విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలపై దృష్టి సారించి ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరంఅవురుపల్లి,నల్లవారిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి కాటమయ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ సమీపంలో నూతన బోర్ మోటార్ ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తాసిల్దారు వినయ్ సాగర్, ఇన్చార్జ్ ఎంపీడీవో వెజ్జన్న, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ సుద్ధపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ ఎంపీపీ బట్టు కిషన్ రెడ్డి, నాయకులు కొండల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి,మాజీ ఎంపిటిసి పాండు గౌడ్,డైరెక్టర్ జంగయ్య గౌడ్, నాయకులు జక్పాల్ రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.