25-09-2025 12:02:13 AM
తూప్రాన్, సెప్టెంబర్ 24 :తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏక్ పెడ్ మాకి నామ్ అనే కార్యక్రమంలో భాగంగా తూ ప్రాన్ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొని మొక్కలను నాటారు. పారిశుద్ధ్య పనులను కొనసాగించిన కా ర్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అమర్ సింగ్, మున్సిపల్ సిబ్బంది, హాస్పటల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.