calender_icon.png 22 October, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ సంబురాలు

22-10-2025 12:18:57 AM

- దీపావళి పండుగ సందర్భంగా సదర్ ఉత్సవాలు 

-ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు 

ఎల్బీనగర్, అక్టోబర్ 21 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. దీపావళి పండుగతోపాటు యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. కొత్తపేట డివిజన్ లోని మారుతీ నగర్ లో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఉత్సవాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... యాదవ కులస్తులకే ప్రత్యేకమైన సదర్ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతా భావం నింపుతుంద న్నారు సదర్ ఉత్సవాల్లో ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయని తెలిపారు.

కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల అధ్యక్షులు తోట మహేశ్ యాదవ్, లింగాల రాహుల్ గౌడ్, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు తోట కృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సురేశ్ యాదవ్, గోపాల్ యాదవ్, తోట రాజు యాదవ్, కొరివి శ్రీనివాస్ యాదవ్, తోట ఆనంద్ యాదవ్, తోట రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట డివిజన్ పరిధిలో యాదవ సోదరులు నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లో సదర్ సమ్మేళనం నిర్వహించారు. మన్సూరాబాద్ చౌరస్తాలో అఖిలభారత్ యాదవ్ ఆధ్వర్యంలో, సాయి నగర్ కాలనీలో బొల్లు మల్లేశ్ యాదవ్, కిశోర్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా సదర్ ఉత్సవం

ఘట్ కేసర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవం వైభవంగా జరిగింది. ఘట్ కేసర్ యాదవ సంఘం అధ్యక్షుడు రాజబోయిన యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవంలో ముఖ్య అతిథులుగా  మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మాజీ సర్పం అబ్బసాని యాదగిరియాదవ్,  మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో యాదవులకు సంబంధించిన పాటలతో హోరెత్తించారు.

దీపావళి పండుగ సందర్బంగా యాదవులు కుల పండుగగా భావించే సదర్ యాదవ సంఘం నాయకులతో కలిసి యాదవుల కుల దైవం అయిన శ్రీకృష్ణ భగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం దున్నపోతుల విద్యాసాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథులు ఘట్ కేసర్ మున్సిపాలిటీ  యాదవులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవ సోదరులు సదరు పండుగ విన్యాసాల కోసం వారి అత్యుత్తమ మగ గేదెలను ప్రదర్శించడానికి ప్రతి కుటుంబం ఈఅవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. గేదెలను నూనెతో మెరుస్తూ, వాటి కొమ్ములు, శరీరానికి రంగులు వేయ డం, మెడ చుట్టూ దండలు, వాటి పాదాలకు చీలమండలు (గజ్జలు), మెడ లేదా నుదుటి పై గంటలతో సీ-షెల్ బ్యాండ్లు, వాటి కొమ్ములపై నెమలి ఈకలతో అలంకరించబడి ఉంటాయి అలా వాటిని చూడటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈకార్యక్రమంలో ఘట్ కేసర్ పట్టణ యాదవ సంఘం సభ్యులు, యాదవులు, పట్టణ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.