20-08-2025 01:51:18 AM
ముషీరాబాద్, ఆగస్టు 19(విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌కు చెందిన ముచ్చకుర్తి ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ముచ్చకుర్తి ప్రభాకర్ మాట్లాడుతూ సంఘంలో చురుకైన పాత్ర పోషించడాన్ని గుర్తించి తనను రాష్ట్ర కార్యదర్శిగా నియ మించారని తెలిపారు.
మున్నూరు కాపుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్య, సామాజిక రంగాలలో మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ గా, రాష్ట్ర కార్యదర్శిగా, బీఆర్‌ఎస్ మీడియా ఇన్చార్జిగా, సీనియర్ జర్నలిస్టుగా, రైల్వే బోర్డు సభ్యులుగా, టెలిఫోన్ కమిటీ అడ్వైజరీ సభ్యులుగా, ఆహార సలహా సంఘం సభ్యులుగా పలు పదవుల్లో పనిచేసినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.