calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై అక్కసుతోనే యూరియా ఇవ్వడంలేదు

20-08-2025 01:51:50 AM

  1. మా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర 
  2. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ మీద అక్కసు తోనే రాష్ట్రానికి రా వాల్సిన వాటాను ఇవ్వడం లేదని పీసీసీ అ ధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మండిపడ్డా రు.మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను తక్షణమే కేంద్రం ఇవ్వాలన్నారు. యూరియా కోసం   రై తులు ఆందోళన చేస్తుంటే  కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లో ఢిల్లీలో పడుకున్నారా? రైతులు ఆందోళనలు పట్టవా..ఇది మం చి పద్దతి కాదని హితవు పలికారు.

రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్రలు చేస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు.

అంతకు ముందు తాండూరు నియోజక వర్గం నుంచి  వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో వారికి  పార్టీ కండువాలు క ప్పి ఆహ్వానించారు.   కార్యక్రమంలో ఎమ్మె ల్యే మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత ఉన్నారు.