07-09-2025 12:44:36 AM
ఒంటెలు, గుర్రాలపై పీఠాధిపతి ఊరేగింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని సింగూర్ గ్రామంలోని దర్గా వద్ద గత రెండు రోజులుగా హజారత్ మహమ్మద్ బాబాన్ షా వలీ.(ర.హ)దాదా హజాద్ ఉర్సు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో వివిధ జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరై పూజలు చేశారు. కుల మతాలకు అతీతంగా ఉర్సు ఉత్సవలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని, దేవుని కృపకు పాత్రులవుతాని దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబిద్ హుస్సేన్ సత్తారుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు.
శనివారం సాయంత్రం పీఠాధిపతిని ఇంటి నుండి గం ధం (సందల్) ఒంటెలు, గుర్రాలపైన కూర్చోబెట్టి బ్యాండ్ మేళాలతో గ్రామ వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. భక్తులతో కలసి ఆయన దర్గా వద్దకు చేరుకొని గంధం సంధాల్, రోజ్ వాటర్, గులాబీ పువ్వులతో దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించగా 18 టీంలు పాల్గొన్నాయి.
ప్రథమ బహుమతి సంగారెడ్డి, ద్వితీయ బహుమతి సింగూర్ యువ చైతున్య టీంలకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గారెడ్డి, దర్గా ఫీఠధాపతి ఇద్దరి అందజేశారు. కార్యక్రమంలో టేకుర్ దర్గా ఇంతియాజ్ సాహెబ్, జహీరాబాద్ దర్గా హరుణ్ సాహెబ్, బోడ్మట్ పల్లి హషం సాహెబ్, సద్దాం సాహెబ్ కర్ణాటక, గౌస్ సాహెబ్ కర్ణాటక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల్లో గోవర్ధన్, రామచందర్‌రెడ్డి, అంజయ్య, సంగమేశ్వర్, వీరారెడ్డి, ఎర్ర గంగారాం, మధుసూదన్, ఎర్ర నాగరాజు, దత్తు, ఎర్ర వెంకట్, మన్నే విజయ్,చెన్నాగౌడ్, ఎర్ర శేఖర్, పి.యదయ్య, దర్గా కమిటీ మెంబెర్స్ సయ్యద్ అజ్మత్, నఖీబ్, ఖయ్యుమ్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.