07-09-2025 12:46:40 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆదివారం మధ్యా హ్నం నుంచి మూసి, సోమవారం ఉదయం తెరవనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు ఉప, అనుబంధ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాభి సహస్రనామార్చన నిర్వహించనున్నారు. కాగా ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల లోపు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలను మూసివేయనున్నారు.
మధ్యాహ్నం 12, సాయంత 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలను రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా చంద్ర గ్రహణం ఆదివారం రాత్రి ౯.౫౬ గంటలకు మొదలై సోమవారం తెల్లవారుజామున ౧.౨౬ గంటలకు ముగియనుంది.