calender_icon.png 15 November, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధం

15-11-2025 03:36:32 PM

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

అత్యాశకు పోయి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం ఎవరితో పంచుకోవద్దు

సైబర్ నేరాల నివారణలో ప్రజల సహకారం అత్యంత కీలకం

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలి. గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో 64 కేసులు నమోదు,₹54,97,683/- రూపాయలు రికవరీ బాధితులకు అందజేత. డిజిటల్ యుగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాగాళ్ళు కూడా కొత్త కొత్త రూపాల్లో ప్రజలను మోసగిస్తున్నరని, వారి భారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధం అని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.

ఫోన్ కాల్స్, సోషల్ మీడియా,బ్యాంకింగ్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లింకులు, లక్కీ డ్రాలు,ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు వంటి అనేక మార్గాల్లో మోసగాళ్లు ప్రజల డేటా, డబ్బు ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ  సైబర్ మోసాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టడంలో సైబర్ క్రైమ్ టీ, సైబర్ వారియర్లు పకడ్బందిగా వ్యవహరిస్తు వచ్చిన ప్రతి పిర్యాదు వెంటనే నమోదు చేసి విచారణ ప్రారంభించడం, ఆధునిక సాంకేతికత ఆధారంగా గడిచిన సంవత్సరం కాలంలో జిల్లాలో 64 సైబర్ కేసులను నమోదు, వచ్చిన సైబర్ పిర్యాదులలో వెంటనే స్పందించి రూ.36,29,853/- ఫ్రీజ్ చేయడంతో పాటు బాధితులు కోల్పోయిన మొత్తం రూ.54,97,683/-లను రికవరీ చేసి వారికి తిరిగి అందజేయడం జరిగిందని తెలిపారు.

సైబర్ క్రైమ్ టీమ్, సైబర్ వారియర్లు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులను సందర్శిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జిల్లా వ్యాప్తంగా సైబర్ భద్రతపై అవగాహన పెంపొందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సైబర్ నేరాల భారిన పడకుండా ప్రజలకు సూచనలు.అనవసర కాల్స్/తెలియని లింకులను నమ్మవద్దు. బ్యాంక్ OTP, PIN, CVV ఎవరికీ చెప్పొద్దు.రుణ యాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ పేరుతో వచ్చే సందేహాస్పద ఆఫర్లను నమ్మొద్దు.ఫేక్ ప్రొఫైల్స్, QR కోడ్స్, ఫేక్ జాబ్ ఆఫర్లను గుర్తించి దూరంగా ఉండండి. మోసపోయిన వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.