15-11-2025 03:27:27 PM
మేడ్చల్ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి
మేడ్చల్ అర్బన్(విజయక్రాంతి): బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిందని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం మేడ్చల్,గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులు జల్లి శైలజ హరినాథ్, కావేరి శ్రీధర్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీ ఫోటో పట్టుకొని నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా పేల్చారు.
ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజానీకం బ్రహ్మరథం పట్టారని కాంగ్రెస్ పాలనలో చేసిన అవినీతి పాపంలో వెంటాడుతుందని ఆయన స్పష్టం చేశారు.కాబట్టి కాంగ్రెస్ మాత్రం ప్రతి ఎన్నికల్లో ఓటమికి ఎన్నికల కమిషన్ ని దోషిగా చిత్రీకరించే పనిలో ఉందని మోహన్ రెడ్డి మండి పడ్డారు.
అనంతరం మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పరిపాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజానీకం మరోసారి అధికారం అప్ప చెప్పారని ఆమె బీహార్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.భారతదేశ మొత్తం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ సర్కార్ ను ప్రజలు ఎన్నుకోవాలని నిర్ణయించుకొని గెలిపించారని కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆమె తెలియజేశారు.
1) గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలో బాణాసంచాలు కాలుస్తున్న బిజెపి నాయకులు.
2) మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మిఠాయిలు పంచుతున్న బిజెపి నాయకులు.