15-11-2025 03:23:11 PM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంను వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీ యందు వ్యాధి నిరోధక టీకాల నిల్వలను కోల్డ్ చైన్ ఐ ఎల్ ఆర్ మరియు డీప్ ఫ్రిజర్ రిఫ్రిజిరేటర్ లో వ్యాధి నిరోధక టీకాల నిల్వలను, ఐస్ ప్యాక్స్ రికార్డులను పరిశీలించి సరిగా నిర్వహించాలని ఫార్మసిస్టు, వైద్యాధికారి గార్లకు సూచించారు.
తరువాత శాంతినగర్ వ్యాధి నిరోధక టీకాల కేంద్రంను తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీలలో ఐదు సంవత్సరాలలో పిల్లలందరి టీకాల రికార్డులను, మిగిలిన పోయిన గౌడ్ -5 సంవత్సరాలు లోపు అందరికీ సకాలంలో టీకాలు అందించి, కేంద్ర ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలని సకాలంలో లక్ష్యాలు సాధించాలని వైద్య సిబ్బందికి సూచించి లేనియెడల చర్యలు గైకొంటామని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్ కుమార్, నవీన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.