22-05-2025 12:18:53 AM
ముంబై, మే 21: ఐపీఎల్-18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్ప టికే ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ౧౧వ సారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడం విశేషం. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్) కీలక ఇన్నిం గ్స్‌తో అలరించగా.. తిలక్ వర్మ (27), రికెల్‌టన్ (25), నమన్ దిర్ (24 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై పరాజయం చవి చూసింది. సమీర్ రిజ్వీ (39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విప్రజ్ నిగమ్ (20) పర్వాలేదనిపించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.