27-08-2025 12:22:18 AM
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను పెన్షన్ పేరుతో మోసం చేస్తోందని యంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వికలాంగులు, వృద్ధుల పెన్షనుదారుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కూడా చట్టసభలకు దూరంగా ఉండి పేదలను మోసం చేస్తున్నాయన్నారు.
ఆకలి, అవమానం తెలిసిన యంఆర్‌పిఎస్ అభాగ్యుల పింఛన్ల కోసం పోరాటానికి సిద్ధమైందని స్పష్టం చేశారు. వికలాంగులకు 6000 , వృద్ధులకు , ఒంటరి మహిళలకు 4వేల రూపాయలు, కండరాల క్షీణత గల వారికి 15వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరగబోయే వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.