calender_icon.png 27 August, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగును కబ్జా చేసిన రామనంద తీర్థ ఇన్‌స్టిట్యూట్

27-08-2025 12:32:39 AM

తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన తోల్కట్ట గ్రామస్తులు

చేవెళ్ల, ఆగస్టు 26: మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలోని సర్వే నెంబర్ 137/అ3 లో ఉన్న వాగును స్వామి రామానంద తీర్థ సోషియో ఎకనామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్లు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు.  ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత భానూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గౌతమ్ కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. సీపీఐ నేత కామ్రేడ్ లింగ్ గౌడ్ ఆధ్వర్యంలో1995లో జరిగిన  పోరాటం కారణంగా ప్రభుత్వం 2001లో సర్వేనెం. 141లో ఇండ్ల స్థలాలు కేటాయించగా కాలనీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. 

అయితే అప్పటి ప్రభుత్వం 2003లో పీవీ నరసింహరావు ఔషధ వనం పేరుతో స్వామి రామానంద తీర్థ  సోషియో ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇనిస్టిట్యూట్కు 30 ఎకరాలు కేటాయిం చిందని చెప్పారు.  ఇందులో సర్వే నెంబర్. 137/అ3లోని వాగు కూడా ఉందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కుమ్మరి శంకర్, యాదయ్య, శ్రీశైలం, సీహెచ్ కృష్ణయ్య, డి. అనిల్, కుమ్మరి గోపాల్, విఠలయ్య, శంకరయ్య, చాకలి నర్సింహ పాల్గొన్నారు.