calender_icon.png 27 August, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో ముదిరిన వర్గ పోరు

27-08-2025 12:27:52 AM

- జిల్లా కమిటీపై రెండు వర్గాల్లో పట్టు

- జూనియర్, సీనియర్ల మధ్య విభేదాలు

-చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, అడ్డుకుంటున్న సీనియర్లు

నిర్మల్, ఆగస్టు (విజయక్రాంతి): క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి భారతీయ జనతా పార్టీ వర్గ విభేదాలు కారణంగా పార్టీ రెండుగా చీలిపోయింది. జూనియర్లు సీనియర్లు రెండు వర్గాలుగా బీజేపీ నేతలు చీలిపోవడంతో జిల్లా కమిటీ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరక వివాదం మరింత రచ్చకెక్కుంది.

బీజేపీ జిల్లా అధ్యక్షులు జరిగి న మాదిరిగానే జిల్లా కమిటీ కూర్పులో తమదే పైచేయి ఉండాలని ఇద్దరు బలమైన నేతలు పట్టుబట్టడంతో పార్టీ పదవుల నియామకంపై వివాదం ఏర్పడినట్లు పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బీజేపీ అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీ తో పాటు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ నిర్మల్ జిల్లాలో పార్టీ పదవుల ఎంపికపై గందరగోళం నెలకొంది.

బిజెపి జిల్లా అధ్యక్షునిగా కానాపూర్ నియోజకవర్గానికి చెందిన రితేష్ రాథోడ్ ను మూడు నెలల క్రితమే పార్టీ ప్రకటించింది. బిజెపి అధ్యక్ష పదవి కోసం అప్పట్లో పార్టీ సీనియర్ నేతలైన అంజి కుమార్ రెడ్డి సోమ రాజేశ్వర్ రెడ్డి బైంసాకు చెందిన విలాస్ బిదిరెల్లి చెంది న దేశ్పాండే పోటీపడ్డప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గం రితీష్ రాథోడ్‌కు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టి పార్టీ అధ్యక్ష పీఠా న్ని కట్టబెట్టారు.

బీజేపీ పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడి పని చేసే నిజమైన నేతలకు జిల్లా పదవి దక్కకపోవడంపై సీనియర్లు దాన్ని విభేదిస్తూ వేరే కుంపటి పెట్టుకున్నట్టు ప్రచా రం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ ముథోల్ నియోజకవర్గాలు ఉండగా నిర్మల్ ముథోల్ నియోజకవర్గం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిథ్యం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీకి జిల్లాలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలు జిల్లా కమిటీలో తమ పేర్లు ఉండాలని పట్టుబడుతున్నారు.

జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథో డ్ మాత్రం మూడు నియోజకవర్గాల్లో అంద ర్నీ కలుపుకుపోయి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ముథోల్ నిర్మల్‌లో కొందరు ముఖ్య నేతలు రెండు వర్గాలు గా చీలిపోయి ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణ మండల కార్యవర్గంలో కూడా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి పదవులు రావడంతో పార్టీ కోసం పని చేస్తే మా సంగతి ఏంటని ఏళ్ల తరబడి కష్టపడి చేస్తున్న కార్యకర్తలు పార్టీ అధిష్టానని నిలదీస్తున్నారు

కుదురని ఏకాభిప్రాయం

భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీని వీలైనంత త్వరగా ప్రకటించాలని రాష్ట్ర పార్టీ అధిష్టానం అన్ని జిల్లాలకు సూచించిన నిర్మ ల్ జిల్లాలో జిల్లా కార్యవర్గం ఏర్పాటుపై నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీ పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే రెండుసార్లు జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ప్రాంతాలు సామాజిక అంశాల ను దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా కష్టపడి పనిచేసే సీనియర్ జూనియర్ నాయకుల కలయికతో జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించా రు.

ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు ఎన్నిక మాత్రమే నిర్మించగా మిగతా కార్యవర్గమైన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి యువజన మోర్చా మైనార్టీ మోర్చా మహిళా మోర్చా బీజేపీ అనుబంధ సంఘా ల జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లా కమిటీలో ఎవరెవరికి అవకాశం కల్పించాలని ముఖ్య నేతలు తర్జనభజన పడుతున్నారు. అధ్యక్షుడు తర్వాత కీలకపాదవైన జిల్లా ప్రధాన కార్యదర్శి విషయంలో నిర్మల్ బైంసా నియో జకవర్గాల చెందిన ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఒక వర్గం నిర్మల్‌కు చెందిన మెడిసిమ్మ రాజును ప్రతిపాదిస్తుండగా మరో వర్గం బైంసాకు చెందిన గాదె విలాస్ ను జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు. ఇద్దరు కూడా పార్టీకి సీనియర్ నేతలు కావడంతో ఎవరికి పదవి ఇచ్చిన మిగతా వర్గం నేతలు పార్టీని విభేదించే అవకాశం ఉండడంతో ఈ పంచాయతీ తెంపడానికి నిర్మల్ ముధోల్ ఎమ్మెల్యేలు రంగంలో దిగినప్పటికీ ఫలితం మాత్రం రావడం లేదని కొందరు సీనియర్ నేతలే పేర్కొంటున్నారు.

ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రితీష్ రాథోడ్ని జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టగా బీసీ వర్గం చెందిన మెడిసిమ్మరాజు విలాస్ గాదేవార్లు పోటీ పడడం తో పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం కుదరడం లేదు. ఉపాధ్యక్షుల విషయంలో కూడా ఇదే పంచాయతీ నెలకొన్న ట్టు పార్టీలోనే ప్రచారం జరుగుతుంది.

నిర్మ ల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లాలో సీనియర్ నేతలైన అయ్యన్న గారి భూమ య్య అంజి కుమార్ రెడ్డి సామ రాజేశ్వర్ రెడ్డి బైంసాకు చెందిన గాదె విలాస్ రవికుమార్ పాండే నేతలు ఎమ్మెల్యేలతో వివిధ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీ అధిష్టానం ఏ పిలుపు ఇచ్చిన జిల్లా బిజెపి కార్యాలయంలో ఆ కార్యక్రమం నిర్వహించవలసి ఉండగా నిర్మల్‌లో బిజెపి కార్యాల యంలో  కార్యాలయంలో ఒక వర్గం ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో మరో వర్గం వేరువేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా సీనియర్ జూనియర్ మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్టీ విజయమే లక్ష్యంగా జిల్లా కమిటీ ఏర్పా టు చేసుకుని ఎన్నికలకు పార్టీ నేత కార్యకర్తలను సిద్ధం చేయవలసిన పార్టీ నేతలు జిల్లా కమిటీలో తమకు పదవులు కావాలని ఎవరికి వారే పట్టుబడుతున్నారు.

అయితే జిల్లా కమిటీలో ముధూల్ నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గం సమ ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయం చేకూర్చేలా అన్ని వర్గాలతో చర్చించి పార్టీ కోసం కష్టపడి పనిచేసే ముఖ్య నాయకులు అందరికీ జిల్లా కమిటీ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పా టు చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిన ఎమ్మెల్యేలు ఒకవైపు సీనియర్ బిజెపి నేతలు మరోవైపు విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అని రీతిగా వివరించడంతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు ఇప్పట్లో ఖరారు అయ్యే అవకాశం లేదని పార్టీ నేతలే చెప్తున్నారు. అయితే పార్టీలో కష్టపడి పనిచేసే తమకు గౌరవం ఇవ్వకపోతే తాము పార్టీ కోసం ఎందుకు కష్టపడి పని చేయాలని కొం దరు సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. 

జిల్లా అధ్యక్ష పదవిని ఖానాపూర్ కు ఇచ్చినందున ప్రధాన కార్యదర్శి పదవిని ముధోల్ నియోజకవర్గం ఇవ్వాలని అక్కడ నేతలు పార్టీ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు ఇందులో ఎస్సీ ఎస్టీలతోపాటు మైనార్టీ బీసీలకు కూడా పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

త్వరలోనే జిల్లా కమిటీని ప్రకటిస్తాం: రితీష్ రాథోడ్

నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపితమే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకొని జిల్లా కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని జిల్లా పార్టీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు, పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని చిన్నచిన్న సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం చర్య లు తీసుకుంటుందన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నేతలకు తప్పకుండా జిల్లా కమిటీలో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.


జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పాటుపై ఇప్పటికి రెండుసార్లు నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్‌తో పాటు సీనియర్ నేతలైన అయ్యన్న గారి భూమయ్య అంజు కుమార్ రెడ్డి, రావుల రామనాథ్ తదితరు నేతలతో చర్చించడం జరిగిందని,  సీనియర్ జూనియర్ నాయకులందరినీ కలుపుకొని పార్టీ ఐక్యత కోసం కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అధిష్టానం తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. వారం రోజుల్లో జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మని జిల్లా నాయకులు కార్యకర్తలు పూర్తి సహకారాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.