calender_icon.png 27 August, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: మాజీ జెడ్పిటిసి శ్రీశైలం

27-08-2025 12:33:00 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండలంలోని పెద్ద ముద్దునూరు గ్రామంలో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పార్టీ లీడర్లు కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారని అట్టి భూములను ప్రభుత్వ అధికారులు పరిరక్షించాలని మాజీ జడ్పిటిసి శ్రీశైలం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెద్ద మొద్దునూర్ గ్రామంలోని గ్రామకంఠం భూములు గ్రంథాలయ భూములను మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు కబ్జా చేసినట్లు ఆరోపించారు.