27-08-2025 12:29:12 AM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని గణేష్ నిమజ్జన స్థలాలైన గోదావరి పరిసరాలను సిఐ రమణ మూర్తి, ఎమ్మార్వో, మున్సిపల్ అధికారులు, ఎస్సై లతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ రమణమూర్తి మాట్లాడుతూ.... గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎలాంటి ప్రమాదాలకు తానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, గజ ఈతగాళ్లనుఅందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.