22-05-2025 11:18:22 PM
29 నుంచి జూన్ 10 వరకు..
షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ..
హైదరాబాద్ (విజయక్రాంతి): గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్స వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ(TGPSC) గురువారం విడుదల చేసింది. ఈనెల 29 నుంచి జూన్ 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అర్హులైన అభ్యర్థులు నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ(Suravaram Pratap Reddy Telugu University) యందు హాజరుకావాలని సూచించింది. అభ్యర్థుల షార్ట్‌లిస్టుకు సంబంధించిన వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. వెబ్ ఆప్షన్ నమోదుకు ఈనెల 27 నుంచి జూన్ 11 వరకు అవకాశం కల్పించింది. 783 గ్రూప్ పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించారు.
వీటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను పూర్తి చేసి తుది ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అయితే వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు ఒక సెట్ జీరాక్స్ సంతకం చేసిన ఫోటో కాపీ తీసుకురావాలని సూచించింది. ఏదైనా కారణం వల్ల హాజరుకాలేని అభ్యర్థులను వెబ్‌ఆప్షన్స్ సరిగా నమోదు చేయని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అలా ఏర్పడిన ఖాళీల కోసం ఇతర అభ్యర్థులను పిలుస్తామని పేర్కొంది.