27-01-2026 05:35:57 PM
పెంచికలపేట (విజయక్రాంతి): మండలంలోని ఎల్కపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను ముఖ్య అతిథిగా ఎంపీడీఓ అల్బర్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ నిర్మల, ఎల్కపల్లి గ్రామ సర్పంచ్ భక్తు రాంచందర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.