27-01-2026 05:33:16 PM
సిఐటియు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆ నిధులను వెంటనే విడుదల చేసి రిటైర్డ్ అయిన టీచర్లు హెల్పర్లకు చెల్లించాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఐసిడిఎస్ డిడబ్ల్యుఓకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ అయి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటు జీతము లేక ప్రభుత్వము ఇస్తామన్న బెనిఫిట్స్ ఇవ్వక కుటుంబాల పోషణ జరగక మానసిక క్షోభను అనుభవిస్తున్నారని సిఐటియు నేతలు డిడబ్ల్యు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను రాష్ట్ర అధికారులకు తెలియజేసి తక్షణ వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని డి డబ్ల్యూ హామీ ఇచ్చారు. అదేవిధంగా పీఎం శ్రీ అంగన్వాడీ కేంద్రాల్లోని అమలు చేయాలని కోరారు. పీఎం శ్రీ పథకం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో ఉండవలసిన 0-5సంవత్సరాల పిల్లలు ప్రాధవిుక పాఠశాలల్లో వుంటారని, దీని ఫలితంగా అంగన్ వాడీ కేంద్రాలు పూర్తీగా నిర్వీర్యం గురవుతాయని పేర్కొన్నారు.
పియంశ్రీ కి వచ్చేనిధులు ఐసిడిఎస్ ద్వారా అంగన్ వాడీకేంద్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సంగానికి పేగా హెల్పర్, టీచర్ పోస్టులు ఖాళీగా వున్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీటీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, జిల్లా నాయకురాలు రమ్య, రమాదేవి, నాయకులు ఝాన్సీ, ఆకుల సీత తదితరులు పాల్గొన్నారు.