01-09-2025 06:53:20 PM
నల్ల బ్యాడ్జీలతో మున్సిపల్ సిబ్బంది నిరసన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వాల్పరుస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సిబ్బంది భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ ఎండీ మజార్ మాట్లాడారు. కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు తీరని నష్టం ఏర్పడుతుందని ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.