calender_icon.png 2 September, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు చారిత్రాత్మకమైనది

01-09-2025 09:01:30 PM

కుబీర్: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా బీసీ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయం అని బీసీ సంఘం నేత మాజీ నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంచాల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఆమె మేరకు ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ బిల్లు వల్ల బీసీలకు ప్రయోజనం చేకూరుస్తుందని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.