calender_icon.png 2 September, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుభీర్ లో జానపదాలతో ఆకట్టుకున్న ఫోక్ సింగర్ సీతక్క

01-09-2025 09:19:20 PM

సీతక్కని సత్కరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు 

కుభీర్: కుబీర్ లోని శ్రీ విట్టలేశ్వరాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన గాన లహరి కార్యక్రమం అహుతులను అలరించింది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాకు చెందిన సీతక్క నిజామాబాదులో పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ తనలోని కళకు బదులు పెడుతుంది జానపద పాటలు ఉద్యమ పాటలను ఆలపించి అందరిని ఆకట్టుకుంది. అధ్యంతం హాజరైన జనాలు చప్పట్లతో ఆమెకు మరింత ఉత్సాహాన్ని అందించారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో సత్కరించి అభినందించారు. చైర్మన్ వైస్ చైర్మన్లు డాక్టర్ బి.పెంటాజీ సూది రాజన్న బెంద్రీ శంకర్ మాజీ సర్పంచ్ బానాజీ విజయ్ కుమార్ ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు