01-09-2025 09:22:01 PM
కుభీర్: మండల కేంద్రం కుభీర్ లోని విద్యాశాఖ కార్యాలయం ఎం ఆర్ సి భవనం గత ఐదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరి వెనుక భాగం మొత్తం కూలిపోయింది. దీంతో ఈ కార్యాలయాన్ని మండల పరిషత్ కార్యాలయంలోని చిన్న గదిలోకి మార్చారు అప్పటినుండి ఉపాధ్యాయులకు నిర్వహించే సమావేశాలు ఆయా పాఠశాలల్లో నిర్వహించుకుంటూ నెట్టుకొస్తున్నారు.
పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ వస్త్రాలు కేజీబీవీలో భద్రపరుస్తున్నారు. సిబ్బంది పని చేసుకునేందుకు కనీస స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ఉపాధ్యాయులు రిపోర్టు ఇవ్వాలన్న ఇతర పనుల మీద వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు మహిళా ఉపాధ్యాయులకు మరింత ఇబ్బందులు కలుగుతున్నాయి ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి నూతన ఎంఈఓ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరుతున్నారు